కరీంనగర్: కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మీడియాకు చూపించారు. నిందితులను 12 రోజుల పాటు దోపిడీ దొంగల కేసులో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.
అరెస్ట్ అయిన దొంగలను రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, మెహతాబ్ ఖాన్గా పోలీసులు తెలిపారు. కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో మే 3న(ఆదివారం) పట్టపగలే భారీ దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే.
పిస్టల్స్తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతో పాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డారు. షాపులోకి ఎంటరైన ఐదు నిమిషాల్లోనే పని ముగించుకున్న దొంగలు.. బయటికి పరుగెత్తి పల్సర్, అపాచీ బైక్లపై పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు పది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీస్, జిల్లా జడ్జి ఇంటికి సమీపంలోనే సినీ ఫక్కీలో భారీ చోరీ జరగడంతో తీవ్ర కలకలం రేగింది.
ప్రెస్ మీట్లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించిన వివరాలు:
* కరీంనగర్ PMJ జువెల్లరీ షాపు చోరీ కేసులో అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
* చోరీ జరిగిన 11 రోజులకు దొరికిన ముఠా
* అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు
* మొత్తం 82 లక్షల విలువైన బంగారం, వజ్రాలు చోరీ
* బీహార్కు చెందిన ది గోల్డెన్ దీప్ సుబోద్ సింగ్ చోరీ మాస్టర్ మైండ్
* మే 3న జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడిన దొంగలు
* నగలు దోచుకుని బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్కు పరారీ
* బీహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
* నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు సీజ్
* బుధవారం రోజున ప్రధాన నిందితుడు జగీరా సింగ్ వెలిచాలలో అరెస్ట్
* 161 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాల చోరీ
* బీహార్, బెంగాల్ కేంద్రంగా అంతర్జాతీయ దొంగల ముఠా చోరీలు
* 2 నెలల క్రితమే తెలంగాణకు వచ్చి చోరీలకు ప్లాన్
* ఇప్పటివరకూ చోరీకి పాల్పడిన ఐదుగురు దొంగల్లో ముగ్గురు అరెస్ట్
* PMJ జువెలరీ షోరూం చోరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 13 మంది గ్యాంగ్
* జాగీర్ సింగ్, రావీశ్ కుమార్, మెహతబ్ ఖాన్ అరెస్ట్
* ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్, మరో 10 మంది నిందితులు
* 6 రాష్ట్రాల్లో దోపిడి దొంగల యాక్టివిటీస్
* ముగ్గురు దొంగలు బీహార్ నుంచి వచ్చారు
* పెద్దపల్లి, సిద్ధిపేట్, ధర్మపురిలో తలదాచుకున్నారు
* తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెక్కీ చేశారు
* ఎక్కడి నుంచి వెళ్లాలో ముందే రెక్కీ వేసుకున్నారు
* చోరీ కోసం ప్రత్యేకంగా సిమ్ కార్డులు తీసుకున్నారు
* ఒక్కో సిమ్ పది వేలు రూపాయలు ఇచ్చి ఫేక్ ఐడీలతో కొన్నారు
* నిందితుల వద్ద నుంచి 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
* మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నుంచి పిస్టల్ కొన్నారు
* ధర్మపురి దగ్గర పల్సర్ బైక్ వదిలేశారు
* నడుచుకుంటూ గోదావరి దాటారు
* ఈ ముఠాపై 7 రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి
* తెలంగాణలో మొదటిసారి ఈ ముఠా చోరీ చేసింది
* దోచిన బంగారాన్ని నేపాల్ పంపించి అమ్మేస్తారు
* బంగారం దోచుకుని మరో ముఠాకు అప్పగిస్తారు
