
మెహిదీపట్నం/గండిపేట/జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్ సిటీలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్వాన్‌లోని హనుమాన్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన రత్నమ్మ(65) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రపోయింది. గురువారం ఉదయం రత్నమ్మ డోర్ తీయకపోవడంతో ఆమె మేనకోడలు కిటీకిలో నుంచి చూడగా.. ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సాయంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లగా.. అప్పటికే రత్నమ్మ చనిపోయి ఉంది.
పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి హైదర్ షా కోట్ ప్రాంతానికి చెందిన లక్ష్మి భర్త కొంతకాలం కిందట చనిపోయాడు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత లక్ష్మి ఇంట్లో ఉరేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. తల్లి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నాటకకు చెందిన సోమనాథ్(28)కు 6 నెలల కిందట పెళ్లైంది. బతుకు దెరువు కోసం బాలానగర్‌కు వచ్చి వినాయకనగర్‌లో రెంట్‌కు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.