
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ వానలు కురవనున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని బుధవారం వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల పిడుగులు, వడగండ్లు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. పలు చోట్ల 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలంలో 35.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 35.3, నిజామాబాద్‌లో 34.7, రామగుండం, ఖమ్మంలలో 34.6, హైదరాబాద్‌లో 34.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. రాత్రి టెంపరేచర్లు కూడా పెరుగుతున్నాయి.