సత్తుపల్లిలో డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

సత్తుపల్లిలో డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
  • మరో ఇద్దరికి గాయాలు
  •    ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రమాదం

సత్తుపల్లి, వెలుగు : కారు అదుపుతప్పి డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని కొత్తకొమ్మేపల్లి కాలనీకి చెందిన సిద్దెసి జాయ్‌‌‌‌‌‌‌‌ (18), మార్సకట్ల శశిధర్‌‌‌‌‌‌‌‌ (11) కలిసి అన్నపరెడ్డిపల్లి గ్రామంలో ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.

 అక్కడి నుంచి కారులో వస్తూ అజయ్‌‌‌‌‌‌‌‌ని, చండ్రుగొండ వెళ్లి ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌, సాజిద్‌‌‌‌‌‌‌‌(21)ను కారులో ఎక్కించుకొని వీఎం బంజర్‌‌‌‌‌‌‌‌ మీదుగా సత్తుపల్లి వస్తున్నారు. కిష్టారం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో జాయ్‌‌‌‌‌‌‌‌, శశిధర్, సాజిద్‌‌‌‌‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా అజయ్, ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఖమ్మం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీహరి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.