
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో సెప్టెంబర్ 10న విషాదం చోటు చేసుకుంది. అయిజ మండలం భూంపురం గ్రామంలో పొలంలో పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. మృతులు భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22) సర్వేస్ (20), సౌభాగ్య (40)ఉన్నారు. గాయాలైన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పింది. జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ హన్మకొండ, యాదాద్రి మవనగిరి, జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.