యూరియా కోసం వెళ్తున్న రైతులను ఢీకొట్టిన బొలెరో

యూరియా కోసం వెళ్తున్న రైతులను ఢీకొట్టిన బొలెరో
  •  ఒకరి పరిస్థితి సీరియస్, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు 

శివ్వంపేట, వెలుగు: బొలెరో వాహనం ఢీకొనడంతో ముగ్గురు రైతులు గాయపడ్డారు. శివ్వంపేట మండల కేంద్రంలో సొసైటీ భవనం సమీపంలో తూప్రాన్–నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైక్ ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు రైతులు గాయపడ్డారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రీను, అచ్చంపేటకు చెందిన గోవర్ధన్ యూరియా కోసం శివ్వంపేట సొసైటీ వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో బొలెరో ఢీకొనడంతో ఆ ముగ్గురు రోడ్డుపై పడిపోయారు.

 ఈ ప్రమాదంలో ఆంజేయులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. శ్రీను, గోవర్ధన్ కు స్వల్ప గాయాలు కావడంతో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.