తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టినట్లు తెలుస్తోంది. నో ఫ్లై జోన్ లో మూడు హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళుతున్నాయని గుర్తించారు. ఇవి ఎయిర్ ఫోర్స్ చెందినవని సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు అనేక పర్యాయములు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండి పడుతున్నారు. నో ఫ్లై జోన్ లోకి హెలికాప్టర్లు ఎందుకు వస్తున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
తిరుమల... ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. అధ్యాత్మిక నగరిగా విరసిల్లుతోంది. ప్రపంచం నలుమూలాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి తిరుగిరుల్లో భారీ భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు. విమానాలు, హెలికాప్టర్లకు ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించి హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టాయనే వార్త కలకలం రేపుతోంది