విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఘాట్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది . ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 37 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సాలో మొక్కును తీర్చుకునేందుకు మజ్జి గైరమ్మ దేవతను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. వీరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు.
