మేడ్చల్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు ముగ్గురు మృతి

V6 Velugu Posted on Sep 28, 2021

మేడ్చల్ జిల్లా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. శామీర్ పేట మండలం తుర్కపల్లి దగ్గర రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను కారు ఢీ కొన్నాయి. స్పాట్ లోనే కారులోని ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కారు తుక్కు తుక్కు అయింది. డెడ్ బాడీలు కారులోనే చిక్కుకుపోయాయి. పోలీసులు అతి కష్టమ్మీద డెడ్ బాడీలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సుదర్శన్, రాజేందర్, వంశీ తమ బంధువులను ఎయిర్ పోర్టులో దింపారు. ధర్మపురికి తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు.. తుర్కపల్లి దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను ఢీ కొట్టింది. సుదర్శన్, రాజేందర్ స్పాట్ లోనే చనిపోయారు. తీవ్ర గాయాలైన వంశీని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ప్రమాదం జరిగింది. లారీ, ఆక్టివా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆక్టివా మీద వెళ్తున్న మహిళ స్పాట్ లోనే చనిపోయింది. 

Tagged Medchal District, Road Accidents,

Latest Videos

Subscribe Now

More News