ఒకేరోజు కరోనాతో ఫ్యామిలీలో ముగ్గురు మృతి

ఒకేరోజు కరోనాతో ఫ్యామిలీలో ముగ్గురు మృతి

తెల్లవారు జామున తల్లి, 
ఉదయం కొడుకు.. మధ్యాహ్నం తండ్రి

నారాయణపేట, వెలుగు: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో చనిపోయారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగుల్​మడ్కకు చెందిన భద్రయ్యస్వామి(70), శశికళ(66) భార్యాభర్తలు. వీరి కొడుకు శంభులింగం(38). 20 రోజుల క్రితం శంభులింగంకు ఆ తర్వాత అతని తల్లిదండ్రులకు కరోనా సోకింది. హోం ఐసోలేషన్​లో ఉంటూ మెడిసిన్ ​వాడుతుండగా సీరియస్​ అవ్వడంతో కుటుంబ సభ్యులు వృద్ధులను మహబూబ్​నగర్ ​ప్రభుత్వ హాస్పిటల్​కు, శంభులింగంను ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున శశికళ మృతి చెందింది. వెంటిలేటర్​పై ఉన్న శంభులింగం ఉదయం 10 గంటలకు చనిపోయాడు. తల్లీ కొడుకుల మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న భద్రయ్యస్వామి గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే రోజు ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 
పునుకుడుచెలకలో రాత్రి కొడుకు.. తెల్లారాక తండ్రి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్త గూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామంలో కరోనాతో తండ్రి,కొడుకు చనిపోయారు. లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక గ్రామానికి చెందిన గొప్ప రాజయ్య కొడుకు రామస్వామి. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో రామస్వామిని కుటుంబ సభ్యులు కొత్తగూడెం గవర్నమెంట్​హాస్పిటల్​లో అడ్మిట్​చేశారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు. కాగా అప్పటికే కరోనా లక్షణాలతో బాధపడుతున్న రాజయ్య శుక్రవారం ఉదయం మృతి చెందాడు. 
బర్లగూడెంలో తండ్రి చనిపోయిన గంటకు కొడుకు
టేకులపల్లి,వెలుగు: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని బర్లగూడెంకు చెందిన తండ్రి, కొడుకు గంట వ్యవధిలో కరోనాతో చనిపోయారు. గ్రామానికి చెందిన పూనం పాపయ్య(70) కొడుకు వసంతరావు(45). పాపయ్యకు కొన్నిరోజుల క్రితం కరోనా సోకింది. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయడు. ఐదు రోజుల క్రితం వసంతరావు టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్​అని తేలింది. కాగా శుక్రవారం తండ్రి చనిపోయిన గంటకు వసంతరావు గుండెపోటుతో చనిపోయాడు. వసంతరావుకు తల్లి నాగమ్మ, భార్య కాంతమ్మ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.