హైదరాబాద్ లో విషాదం..రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాదం..రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. జనవరి 31న ఉదయం చర్లపల్లి-  ఘట్ కేసర్  రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన తల్లి పి. విజయా రెడ్డి,  కూతురు  తన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. కూతురు ఇంటర్ సెకండియర్, కుమారుడు విశాల్ రెడ్డి  ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు తెలుస్తోంది.  

మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వారి ఆత్మహత్యకు ఆర్థిక కారణాలా? కుటుంబ వివాదాలేమైనా ఉన్నాయా? లేక  ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వారి నివాసం దగ్గరకు వెళ్ళి స్థానికులను ఆరాదీస్తున్నారు.