మూడు నెలల ఫీజు మాఫీ చేసిన ప్రైవేట్ స్కూల్

మూడు నెలల ఫీజు మాఫీ చేసిన ప్రైవేట్ స్కూల్

విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓ ప్రైవేట్ స్కూల్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ స్కూళ్లో చదువుతున్న విద్యార్థుల ఫీజును మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు ప్రయాగ్ రాజ్ లోని న్యూ స్కాలర్ అకాడమీ స్కూల్ ప్రకటించింది. ‘కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ విధించబడింది. దాంతో చాలామంది పనులు లేక, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజు చెల్లించడం కష్టం. అందుకే మేం ఏప్రిల్, మే, మరియు జూన్ ఫీజులను మాఫీ చేయాలని నిర్ణయించాం. అలా అని స్కూళ్లో పనిచేసే సిబ్బందికి ఫీజులను ఆపలేదు. నెలనెలా వారి జీతాలను చెల్లిస్తూనే ఉన్నాం. ఫీజులు మాఫీ చేయడం వల్ల చాలామంది పేరెంట్స్ మమ్మల్ని కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నారు. స్కూల్స్ బంద్ ఉండటం వల్ల.. మేం ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులను ప్రోత్సహిస్తున్నాము. అందుకోసం వాట్సాప్ మరియు మా యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులతో కనెక్ట్ అవుతున్నాం. వారి నుంచి మాకు సానుకూల స్పందన వస్తోంది. కానీ, ప్రతి విద్యార్థికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అందువల్ల మేం ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తున్నాం’ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తెలిపారు.

కరోనా వల్ల ఇక్కడి పాఠశాలలు దాదాపు మూడు నెలలుగా మూసివేయబడ్డాయి. అందుకే మేం మా పిల్లల కోసం ఆన్‌లైన్‌ తరగతులను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని ఓ విద్యార్థి తండ్రి ఆనంద్ కుమార్ తెలిపారు.

For More News..

అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు