
ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం చనిపోయిన రోజు ఈ ముగ్గురు అక్కడే ఉన్నారని … మృత దేహాన్ని చూసి కూడా ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.