హైదరాబాద్,వెలుగు: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ బంధువులను ముగ్గురిని.. సిట్ శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. కాంతారావు, రవితో పాటు మరో వ్యక్తి పేపర్ సేల్ చేయడంలో ప్రవీణ్‌కు సహకరించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ముగ్గురి అరెస్ట్‌తో పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 99కి చేరింది. పేపర్ లీకేజీతో మరో 50 మందికి సంబంధం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

