క్రికెట్ లో ప్రతి జనరేషన్ లో కొంతమంది ప్లేయర్లు తమదైన మార్క్ వేస్తారు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడుతూ అలవోకగా పరుగులు రాబడతారు. గత (2011-2020) దశాబ్దంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ ఫ్యాబ్-4 గా ఈ లిస్ట్ లో ఉన్నారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు. అయితే ప్రస్తుతం వీరు క్రికెట్ లో పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. ఫామ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడం లేదు.
మూడు ఫార్మాట్లలో వీరు రెగ్యులర్ గా కొనసాగడం లేదు. స్మిత్ కు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. టీ20 ఫార్మాట్ లో చోటు దక్కడం లేదు. రూట్ పరిస్థితి అలాగే ఉంది. టీ20ల్లో చోటు కోల్పోయిన రూట్.. వన్డేల్లో స్థానం అనుమానంగా మారింది. కోహ్లీ కూడా ఒక్క ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పిన విరాట్.. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ సంగతి పక్కన పెడితే రూట్, విలియంసన్, స్మిత్ టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. మిగిలిన ఫార్మాట్ లలో వీరు తమ నిలకడ కోల్పోయినా సుదీర్ఘ ఫార్మాట్ లో అదరగొడుతున్నారు.
బుధవారం (డిసెంబర్ 10) ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియంసన్ ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించి ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన యాషెస్ రెండో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన స్మిత్.. ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఫ్యాబ్-4 లో ముగ్గురు క్రికెటర్లు టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్-3 లో ఉన్నారు. ఈ లిస్ట్ లో కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ కోహ్లీని మిస్ అవుతున్నారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
కోహ్లీ టెస్ట్ రికార్డ్ అద్భుతం:
2011లో వెస్టిండీస్ టూర్ లో ఇండియా 269వ టెస్టు ప్లేయర్‌గా ఈ ఫార్మాట్‌లోఅరంగేట్రం చేసిన విరాట్ 14 ఏండ్ల కెరీర్‌లో పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. కెప్టెన్‌గా టీమిండియాను జట్టును టెస్టు ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-–19లో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిపాడు. దాంతో టెస్టులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియా కెప్టెన్‌గా మారాడు.
ఓవరాల్‌గా గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత నాలుగో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. ఇండియా కెప్టెన్‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌ల్లో 11 గెలవడం విశేషం. అయితే, గత నాలుగేండ్ల నుంచి తను క్రమంగా ఫామ్ కోల్పోయాడు. సౌతాఫ్రికాలో సిరీస్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
37 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.

