
కడప జిల్లా పెండ్లిమర్రిలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటుపడ్డ కొంతమంది శానిటైజర్ తాగి మృతిచెందారు. మొత్తం పదిమంది శానిటైజర్ తాగినట్లు సమాచారం. వారిలో ఓబులేసు, భీమయ్య, చెన్నకేశవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులు శానిటైజర్ తాగిన విషయం బయటకు రాకుండా బంధువులు రహస్యంగా ఉంచారు. చెన్నకేశవులు మృతి చెందిన విషయం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా బంధువులు ఖననం చేశారు. మరో వ్యక్తి ఓబులేసు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీమయ్య అనే వ్యక్తి ఆయన ఇంట్లోనే మృతి చెందగా.. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.
For More News..