అమెరికాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే రోజు డెలివరీ అయ్యారు

అమెరికాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే రోజు డెలివరీ అయ్యారు

ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలుంటే… ఎవరికి ఎప్పుడు పెళ్లి అయితే ఆ తర్వాత ఏడాదికో లేదంటే మరో సంవత్సరం తర్వాతనో డెలివరీ అవుతుంటారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే రోజు..ఒకే ఆస్పత్రిలో ప్రసవించారు. ఈ అరుదైన ఘటన అమెరికాలో జరిగింది.

ఆస్లే హయ్నెస్, దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. వీరు ముగ్గురు ఒకేసారి గర్భంతో ఉండగా పురిటినొప్పులతో జులై 3న ఒహియో మ్యాన్స్ ఫీల్డ్ ఆస్పత్రిలో చేరారు. మొదట సిజేరియన్ చేయించుకుని డెలివరీ అవుదామనుకున్నారు. అది కుదరకపోవడంతో నాలుగున్నర గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రసవించారు. వీరికి డెలివరీ చేసిన డాక్టర్ కూడా ఒక్కరే…అది కూడా నార్మల్ డెలివరీనే.

ఆస్లే హయ్నెస్ కు 2.7 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టింది. ఎరియల్ విలియమ్స్ కు 3.6 కిలోల బరువుతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దనీషా హయ్నెస్ కూడా ఆడ శిశువు జన్మించింది. ఈ ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఇలాంటి అరుదైన ఘటన 5 కోట్ల మందిలో ఒక కుటుంబంలోనే సాధ్యమవుతుందని తెలిపారు డాక్టర్లు. ఈ అరుదైన ఘటన తమ ఆస్పత్రిలో జరగటం సంతోషంగా ఉందన్నారు.