దసరాకు 3 వేల స్పెషల్​ బస్సులు.. 50 శాతం చార్జీల పెంపు

దసరాకు 3 వేల స్పెషల్​ బస్సులు.. 50 శాతం చార్జీల పెంపు

22 నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్
రద్దీని బట్టి మరిన్ని పెంచుతామన్న ఆర్టీసీ

హైదరాబాద్​, వెలుగు: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్​ నుంచి వివిధ ప్రాంతాలకు 3 వేల స్పెషల్​ బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఎంజీబీఎస్​, జేబీఎస్​ నుంచి 281 బస్సులను నడిపామని, 22 నుంచి మరిన్ని పెంచుతామని తెలిపింది. 22 నుంచి 24 వరకు 2,034 బస్సులు నడుపుతామని చెప్పింది. 24న 614 స్పెషల్​ బస్సులను అదనంగా నడుపుతామని వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ పెరిగితే దానికి తగ్గట్టు మరిన్ని బస్సులను పెంచుతామని పేర్కొంది. 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు www.tsrtconline.in ద్వారా అడ్వాన్స్​ రిజర్వేషన్​ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎంజీబీఎస్​, జూబ్లీ బస్​స్టేషన్​, దిల్​సుఖ్​నగర్​, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​ నగర్​, అమీర్​ పేట, టెలిఫోన్​ భవన్​, ఈసీఐఎల్​, ఉప్పల్​ క్రాస్​ రోడ్​, ఎల్బీ నగర్​తోపాటు సిటీలోని శివారు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పింది. ఎంక్వైరీకి కోసం ఎంజీబీఎస్​లో 833093357, జేబీఎస్​లో 04027802203, దిల్​సుఖ్​నగర్​లో 040 23747297, కేపీహెచ్​బీ 9490484232, ఈసీఐఎల్​ 986627079 ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పింది. కాగా, ఆర్టీసీ సమ్మె కారణంగా పోయినేడాది దసరాకు స్పెషల్​ బస్సులను నడుపలేదు. ఇప్పుడు కరోనాతో బస్సులు ఏ మేర నిండుతాయోనన్న అనుమానం ఉందని, బస్సుల్లో రద్దీని బట్టి చార్జీలపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. ఏపీతో ఇంటర్​స్టేట్​ అగ్రిమెంట్​ కుదరకపోవడంతో అక్కడికి బస్సులు నడపట్లేదు. అయితే, ఏపీ మీదుగానే బెంగళూరుకు వెళ్లాల్సి ఉండడంతో.. బెంగళూరుకూ బస్సులను ఆర్టీసీ నడపట్లేదు. లాంగ్​రూట్​ వెళ్లే బస్సు సర్వీసుల చార్జీలను 50 శాతం పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.

For More News..

ఎన్జీటీ నోటీసులు కొట్టేయమంటూ హైకోర్టుకు మంత్రి కేటీఆర్

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య

బిడ్డ పుట్టిందని డివోర్స్ అడిగిన జవాన్