టికెట్లు మేమే పెట్టు కుంటం.. ప్లైట్స్ వేయండి

టికెట్లు మేమే పెట్టు కుంటం.. ప్లైట్స్ వేయండి
  • ఖతార్ లో వలస కార్మికులకు కష్టాలు
  • చిక్కుకుపోయిన 3వేల మంది తెలంగాణవాసులు

పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు పోయిన తెలంగాణ వలస కార్మికులు కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. వీసా టైమ్ అయిపోవడంతో కంపెనీ వాళ్లు ఇండియాకు వెళ్లాలని సూచించారు. అదే టైమ్‌‌లో లాక్‌డౌన్‌తో విమానాలు రద్దయ్యాయి. దాంతో ఇండియాకు రాలేక.. అక్కడ ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమను ఎట్లనైనా ఇండియాకు తీస్కరావాలని వేడుకుంటున్నారు. తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డితోపాటు పలు జిల్లాల కు చెందిన మూడు వేల మందికిపైగా కార్మికులు రెండేండ్లకింద ఖతార్ వెళ్లారు.వీసా టైమ్‌‌ ముగియడంతో కార్మికులు స్వదేశానికి వెళ్లడాని కి పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చారు. అదే టైమ్‌‌లో లాక్‌డౌన్ స్టార్ట్ కావడంతో ఫ్లైట్స్ లేక అక్కడే చిక్కుకున్నా రు. చేతిలో డబ్బుఖర్చయి పోవడంతో తినడాని కి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను స్వస్థలాలకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. టికెట్ డబ్బులు పెట్టుకుంటామని ఫ్లైట్స్ వేయాలని కోరుతున్నారు.