
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ముగ్గురు వెలుగు ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. న్యూస్ పిక్చర్స్ కన్సొలేషన్ విభాగంలో సిద్దిపేటకు చెందిన మహిమల భాస్కర్‌రెడ్డి, కేటగిరీ 2 విభాగంలో వరంగల్‌కు చెందిన చేటి శ్రీనివాస్ (ప్రాజెక్టులు), కేటగిరీ 3లో కరీంనగర్‌కు చెందిన అజయ్‌పాల్‌సింగ్ (పండుగలు) ఎంపికయ్యారు. విజేతల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ శనివారం ప్రకటించింది. జర్నలిస్టుల అసోసియేషన్, ప్రభుత్వ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కలిసి ఈ పోటీలు నిర్వహించాయి. ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు జి.భాస్కర్ తెలిపారు.