జగిత్యాల జిల్లాలో ఒకే ఇంట్లోంచి ముగ్గురు వార్డు మెంబర్లు

జగిత్యాల జిల్లాలో ఒకే ఇంట్లోంచి ముగ్గురు వార్డు మెంబర్లు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో  రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే ఇంట్లో ముగ్గురు వార్డు మెంబర్లుగా గెలుపొందారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తుమ్మల నర్సమ్మ, కొడుకు తుమ్మల గంగారం, కోడలు తుమ్మల అర్చన నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోటీలో ఈ ముగ్గురు గెలుపొందారు.