నిర్మల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు జననం

నిర్మల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు జననం

నిర్మల్ జిల్లా: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది ఓ మహిళ. కరీంనగర్ జిల్లా, సోన్ మండలం జాప్రాపూర్‌కు చెందిన హిమజ అనే మహిళ శనివారం ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.  ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.