ఇద్దరు మహిళలు, ఓ బాలిక మిస్సింగ్ : గుడికి వెళ్లి తిరిగి రాలేదు

ఇద్దరు మహిళలు, ఓ బాలిక మిస్సింగ్ : గుడికి వెళ్లి తిరిగి రాలేదు

కుత్బుల్లాపూర్​, వెలుగు : గుడికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన తల్లీకూతుళ్లు మిస్సింగ్ అయిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..సూరారంలోని న్యూ శివాలయనగర్​కు చెందిన ఉప్పరి గోపాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గోపాల్ కూతురు స్రవంతి(30)కి కొన్నేళ్ల క్రితం వెంకటేశ్ అనే వ్యక్తితో పెళ్లైంది. స్రవంతి, వెంకటేశ్ దంపతులకు కుమార్తె పద్మప్రియ(8) ఉంది. స్రవంతి, వెంకటేశ్ మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన కూతరు పద్మప్రియతో కలిసి నాలుగేళ్లుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది.

ఈ నెల 26న ఉదయం 8.30గంటలకు గుడికి వెళ్లొస్తాం అని చెప్పి స్రవంతి  తన కూతురు పద్మప్రియతో కలిసి బయటికెళ్లి తిరిగి రాలేదు. దీంతో శుక్రవారం స్రవంతి తండ్రి గోపాల్ దుండిగల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మేడ్చల్ లో..

యువతి మిస్సింగ్ అయిన ఘటన శామీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్  కథనం ప్రకారం..మూడుచింతలపల్లి గ్రామానికి చెందిన బూరుగు అనురాధ(20) ఈ నెల 28న మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో తన ఓటరు కార్డు, ఆధార్ కార్డు తీసుకుని ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం సాయంత్రం ఆమె తండ్రి మల్లేశ్ శామీర్ పేట పోలీసులకు కంప్లయింట్ చేశాడు.