స్కూటీ నుంచి జారి.. డీసీఎం కింద పడి..మూడేళ్ల చిన్నారి దుర్మరణం

స్కూటీ నుంచి జారి.. డీసీఎం కింద పడి..మూడేళ్ల చిన్నారి దుర్మరణం

ఖమ్మం టౌన్‌‌‌‌, వెలుగు: ఖమ్మం నగరంలోని భద్రాచలం మార్గంలో ఎన్టీఆర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన జెట్టి అశోక్‌‌‌‌ దంపతులు తమ మూడేళ్ల చిన్నారిని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని స్కూటీపై సిగ్నల్‌‌‌‌ వద్ద ఆగారు. గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ పడటంతో అశోక్‌‌‌‌ స్కూటీని ముందుకు కదిలించగా, మధ్యలో కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా జారి కింద పడింది.

అదే సమయంలో విశాఖపట్నం వెళ్తున్న డీసీఎం వ్యాన్‌‌‌‌ చిన్నారి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం టూటౌన్‌‌‌‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే తల్లిదండ్రులు చిన్నారి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లారు. డీసీఎం వ్యాన్‌‌‌‌ను స్టేషన్‌‌‌‌కు తరలించారు. అనంతరం మృతదేహంతో ఖమ్మం రావాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పేరెంట్స్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.