దారుణ హత్య.. కన్న తండ్రి ముందే కొడుకుని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

దారుణ హత్య.. కన్న తండ్రి ముందే కొడుకుని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. విచక్షణారహితంగా యువకుడిని పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అసద్ బాబా నగర్ లో ఖలీల్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అడ్డు వచ్చిన కన్న తండ్రిని పక్కను నెట్టి ఖలీల్ ను వెంబడించి పట్టుకుని తండ్రి చూస్తుండగానే విచక్షణారహితంగా ఖలీల్ ను కత్తులతో పొడిచి హత్య చేశారు.

 ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని హంతకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.