మాజాలో థమ్సప్

మాజాలో థమ్సప్

కాగజ్ నగర్, వెలుగు: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో కూల్ డ్రింక్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కోకాకోలా కంపెనీకి చెందిన మాజా కూల్​ డ్రింక్ సీసాలో థమ్సప్ కనిపించడం చర్చనీయాంశమైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ఓ బేకరీలో ఈ చిత్రం కనిపించింది. మాజా అని రాసి ఉన్న సీసాలో నల్ల రంగు థమ్సప్​ లిక్విడ్ ఉండడం చూసి ఇదేమి విచిత్రం అంటూ జనం చర్చించుకుంటున్నారు.