
అకాల వర్షాలు రాష్ట్రాన్ని ఇప్పట్లో వదిలేలా లేవు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం.. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్ వీణవంక మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో చెట్లు విరిగాయి. ఈదురు గాలికి రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగిపడటంతో.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ అర్బన్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం పటేల్ గూడెం చెందిన పొన్నాల శ్రీనివాస్.. పిడుగుపాటుతో చనిపోయాడు.
తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందంటోంది వాతావరణ శాఖ. ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ అధికారులు. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయంటున్నారు వాతావరణ అధికారులు.