హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు

హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 17వ తేది  బుధవారం రాత్రి నుండి హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్,కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,  పంజాగుట్ట,అమీర్ పేట ,ఖైరతాబాద్,  కూకట్ పల్లి, పఠాన్ చెరు, మియాపూర్, సికింద్రాబాద్, జేబీఎస్, అల్వాల్,  మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అటు జిల్లాలోనూ పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అయితే రేపు పగటి పూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం కాస్త వానలు పడి, ఉక్కపోత పెరుగుతుందని చెబుతున్నారు.

.