కమర్షియల్ కంటెంట్‌‌తో తుఫాన్ : విజయ్ ఆంటోనీ

కమర్షియల్ కంటెంట్‌‌తో తుఫాన్ : విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తుఫాన్’. మేఘా ఆకాష్ హీరోయిన్. కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు.  ఆగస్టు 2న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం తెలుగు వెర్షన్‌‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరైన దర్శకుడు కరుణాకరన్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు. 

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘విజయ్ మిల్టన్ మంచి స్క్రిప్ట్ రాశారు.  త్వరలో స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఇదొక కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్ అని, ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని దర్శక నిర్మాతలు చెప్పారు. నటుడు సత్యరాజ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.