V6 News

వందకే టీ20 వరల్డ్ కప్ టికెట్‌‌‌‌‌‌‌‌.. మొదలైన మెగా టోర్నీ టికెట్ల సేల్‌‌‌‌‌‌‌‌

వందకే టీ20 వరల్డ్ కప్ టికెట్‌‌‌‌‌‌‌‌.. మొదలైన మెగా టోర్నీ  టికెట్ల సేల్‌‌‌‌‌‌‌‌

ముంబై: వచ్చే ఏడాది ఇండియాలో జరిగే మెన్స్ టీ20 వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు గురువారం షురూ అయ్యాయి. ఇండియాతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీ  టికెట్ల ధరలను ఐసీసీ ఈసారి  సామాన్యులకు అందుబాటులో ఉంచేలా చాలా తక్కువగా నిర్ణయించింది. 

ఫస్ట్ ఫేజ్ సేల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా కొన్ని స్టేడియంలో ప్రారంభ టికెట్ ధర రూ. వంద  (శ్రీలంక కరెన్సీలో ఎల్‌‌‌‌‌‌‌‌కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1000) నుంచి మొదలవుతుంది. 20 జట్లతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌‌‌‌‌కతా నగరాలతో పాటు శ్రీలంకలో కొలంబో, క్యాండీ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. 

ఈ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ను అత్యంత తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే గ్లోబల్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీసీ సీఈవో  సంజోగ్ గుప్తా తెలిపారు. క్రికెట్‌‌‌‌‌‌‌‌ను ప్రేమించే ప్రతి అభిమాని, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే టిక్కెట్ ధరలు ఇంత తక్కువగా ఉంచినట్లు  వివరించారు.  కాగా, తొలి రోజు ఫిబ్రవరి 7న జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్  చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇండియా.. యూఏఈ జట్టుతో ముంబైలో తలపడనుంది.