సఫారీ రైడ్లో వెంటపడ్డ పులి.. భయంతో వణికిన పర్యటక బృందం

సఫారీ రైడ్లో వెంటపడ్డ పులి.. భయంతో వణికిన పర్యటక బృందం
  • ఉత్తరాఖండ్ లోని నేషనల్ పార్క్ లో ఘటన

డెహ్రాడున్ : ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యా టక బృందానికి పులి వెంటపడింది. దీంతో వారంతా భయంతో వణికిపోయారు. పార్క్ లో ఓ చోట పొదల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ వాహనాన్ని నిలిపే శాడు.

టూరిస్టులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకో వడంలో బిజీగా ఉన్నారు. ఇదంతా చూసిన పులి గాండ్రిస్తూ జీప్ వైపు పరిగెత్తుకొచ్చిం ది. అప్పటిదాకా పులిని చూస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులకు దాని గాండ్రింపుతో హడలిపోయారు. పెద్దగా కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి జీప్ ను నెమ్మదిగా కదిలించాడు. జీప్ వెళ్లిపోతుండడం చూసి పులి కూడా నెమ్మదిం చి వెనుదిరిగింది.