
జైపూర్ : పొలం పనులకు వెళ్లిన మహిళపై పులి దాడి చేయడంతో..ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన శనివారం ఉదయం రాజస్థాన్ లో జరిగింది. సవాయ్ మాదోపూర్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల మహిళ ఈ ఉదయం పొలానికి వెళ్లింది. చేనులో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయని..చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునేలోపే మహిళను తినేసి, పులి పారిపోయిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు. సహాయక బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హస్పిటల్ కి తరలించారు.