వామ్మో… బైక్ ను పులి వెంటాడింది..!! వీడియో

వామ్మో… బైక్ ను పులి వెంటాడింది..!! వీడియో

ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఇది. జూలో నెట్ కు అవతల పులి ఉంటేనే భయపడిపోతుంటాం. అలాంటిది… అది మనల్నే టార్గెట్ గా మీదకు ఉరికొస్తే..!!!! ఊహించడానికి కూడా భయంగా ఉంటుంది. కేరళలో ఇలాంటిదే ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలోని వయనాడ్ జిల్లా ముత్తంగ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు బైకర్స్ అడవి మార్గంలోని రోడ్డుపై జంతువులను వీడియో తీస్తూ బైక్ పై వెళ్తున్నారు. అదే టైమ్ లో ఓ పులి వీరిని చూసి పరుగందుకుంది. బైకర్స్ ను అందుకోవడానికి  ప్రయత్నించింది. రోడ్డుకు అటువైపు ఉన్న పులి.. ఇటువైపుకు వస్తూ.. బైక్ ను చేజ్ చేసింది. ఐతే.. బైక్ ను స్పీడ్ గా పోనివ్వడంతో.. వారికి ప్రమాదం తప్పింది. ఈవీడియో చూస్తున్నవారందరూ వామ్మో.. బైకర్స్ బతికిపోయారుగా అనుకుంటున్నారు.