- వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి ఈలూ సింగ్ మేరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణులను లెక్కించేందుకు అవసరమైన వాలంటీర్ల కోసం ఎంపిక ప్రక్రియ చివరి తేదీని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు వన్యప్రాణి ముఖ్య సంరక్షిణాధికారి ఈలూ సింగ్ మేరు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
జనవరి 17 నుంచి 20 వరకు మొదటి దశ, అదే నెల 22 నుంచి 24 వరకు రెండో దశ మొత్తంగా 6 రోజులపాటు లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటిదాకా3,800 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఇందులో భాగస్వాములు కావొచ్చన్నారు. ఇందుకోసం వారు వ్యక్తిగతంగా సెలవు పెట్టుకొని రావాలని ఈలూ సింగ్ మేరు సూచించారు.
