పత్తిచేనులో పెద్ద పులి కళేబరం

పత్తిచేనులో పెద్ద పులి కళేబరం

కొమురం భీం జిల్లా: సిర్పూర్ (టి) మండల సరిహద్దుల్లో పులి కళేబరాన్ని గ్రామస్తులు గుర్తించారు. మహారాష్ట్రలోని పొడుసా గ్రామం దగ్గర్లోని పత్తి చేనులో.. పెద్దపులి కళేబరం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. గ్రామస్తులు గమనించి.. వెంటనే పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పెద్దపులి కళేబరం ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఇది మహారాష్ట్ర పరిధిలోని పులి అనీ.. తెలంగాణలోకి ఇటీవల కాలంలో వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు.