వామ్మో… రోడ్డుపై హడలెత్తించిన పులి

వామ్మో… రోడ్డుపై హడలెత్తించిన పులి

ఆ దారిలో రాకపోకలు బంద్

పెద్దపులి మామూలుగా అడవిలో ఉండాలి. కానీ.. రోడ్డెక్కితే రచ్చ మామూలుగా ఉండదు. అక్కడెక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే… కుమ్రంభీమ్ జిల్లాలో పులి రోడ్డెక్కింది. ఆ దారిన బస్సులో వెళ్తున్న వారి గుండెలు అదరగొట్టింది. రోడ్డు పక్కన చెట్లనుంచి రోడ్డుపైకి వస్తున్న పులిని….  బస్సులోనుంచి చూసిన జనం ఒక్కసారిగా జడుసుకున్నారు.

కుమురంభీం జిల్లా పెంచికల్ పేట్ మండలం… కొండపల్లి గ్రామ శివారులోని రోడ్డుపై ఈ పెద్దపులి కనిపించింది. బస్సులోని ప్రయాణికులు.. దూరం నుంచి ఫొటో తీసి అధికారులకు పంపించారు. అడవి నుంచి పులి రోడ్డుపైకి వచ్చిందన్న వార్తలతో.. దగ్గర్లోని గ్రామస్తులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు. ఆ దారిన సైకిల్, బైక్ వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిసి.. రాకపోకలు బంద్ చేసినట్టు సమాచారం.