
మనుషుల్లాగే జంతువులకు కూడా ప్రాదేశిక సరిహద్దులు ఉంటాయి. అంటే టెరిటోరియల్ బౌండరీస్. ఒక జంతువుకు సంబంధించిన బౌండరీ మరోటి దాటితే వాటి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇది పులులు, సింహాలు లాంటి క్రూర జంతువుల విషయంలో కాస్త క్రుయెల్ గా ఉంటుంది. అభయారణ్యంలో రెండు పులల మధ్య జరిగిన టెరిటోరియల్ ఫైట్ లో బ్రహ్మ పులిని చంపేసింది చోటామాట్కా టైగర్. ఈ పులి గతంలో కూడా రెండు పులలను చంపేసింది.
మహరాష్ట్ర చంద్రపూర్ తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మంగళవారం పులుల మధ్య భీకర యుద్ధం జరిగింది. రాందేగి అటవీ ప్రాంతంలో చోటా మాట్కా , బ్రహ్మ పులుల మధ్య జరిగిన ఫైటింగ్ లో బ్రహ్మ పులి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘర్షణలో చోటా మాట్కా పులి తీవ్రంగా గాయపడింది.
చోటామాట్కా పులి ఏర్పాటు చేసుకున్న టెరిటోరియల్ లోకి వేరొక పులి వస్తే సహించేది కాదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తన ప్రాదేశిక ప్రాంతంలోకి వచ్చిన భజరంగ్, మోగ్లి అనే రెండు పులులను చంపేసిందని తెలిపారు. ఇటీవల బ్రహ్మపులి అడుగుపెట్టడంతో చోటామాట్కా పులి తీవ్రంగా దాడికి దిగిందని.. రెండు పులల మధ్య గంటల తరబడి జరిగిన ఘర్షణలో బ్రహ్మ పులి చనిపోయిందని తెలిపారు అధికారులు. రెండు పులల మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.