టైగర్‌‌‌‌‌‌‌‌ టైమ్ ఫిక్స్ 

టైగర్‌‌‌‌‌‌‌‌ టైమ్ ఫిక్స్ 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ఆయన నటిస్తున్న  క్రేజీ ప్రాజెక్టుల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీకృష్ణ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసిన టీమ్.. ప్రస్తుతం ప్రమోషన్స్‌‌‌‌పై ఫోకస్ పెట్టింది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను మే 24న విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. ఫస్ట్ లుక్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను రాజమండ్రిలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 1970 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో జరిగే స్టోరీ కావడంతో రవితేజ కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌‌‌‌, యాసతో అలరించనున్నట్టు టీమ్ చెబుతోంది. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న సినిమా రిలీజ్ కానుంది.