
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని, దీంతో రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, అక్టోబర్ 20 నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘టైగర్’ వేట ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోకు మంచి స్పందన లభించిందని, త్వరలోనే టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇక దసరా సీజన్‌లోనే బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘లియో’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.