
- ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కవ్వాల్ లోనూ టైగర్ సఫారీ షురువైంది. మూడు నెలల కింద బంద్ కాగా.. ఈ నెల 1 నుంచి తిరిగి మొదలైంది. జన్నారం కేంద్రంగా ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్అందాలను ఆస్వాదించడానికి అక్టోబర్ నుంచి జనవరి వరకు అనుకూలంగా ఉంటుంది. అటవీ అందాలను వీక్షించడం మరపురాని అనుభూతిగా మిగుల్చుతుంది. ఏటా ఇదే సీజన్లో కవ్వాల్కు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది. తెలంగాణ టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలతో పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్పలుచోట్ల వాచ్టవర్లు నిర్మించింది. ఉడెన్ బ్రిడ్జిలు, కాటేజీలు ఏర్పాటు చేశారు. అడవిలో చుక్కల జింకలు, కోతులు, కొండెంగలు, అడవిపందులు, దున్నల గుంపులను చూడవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగుబం ట్లు వంటివి కనిపిస్తుంటాయి. సుమారు 300 రకాల పక్షులను కవ్వాల్ఫారెస్ట్లో గుర్తించారు. ఏటా నిర్వహించే బర్డ్‌వాచ్ ఫెస్టివల్‌కు బర్డ్లవర్స్పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
ఆహ్లాదంగా సాగే జంగిల్ సఫారీ
జంగిల్సఫారీలో విహరిస్తూ కవ్వాల్అందాలను ఆస్వాదించవచ్చు. తొమ్మిది సఫారీ వెహికల్స్ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 8.30 వరకు 9.30 నుంచి 11.30 వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు సఫారీ ద్వారా అడవిలో తిప్పుతారు. గోండుగూడ బేస్‌క్యాంప్, వాచ్‌టవర్, బైసన్ కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంటను చూపిస్తారు. బైసన్‌కుంట వద్ద చుక్కల దుప్పులు, అడవిదున్నలు కనిపిస్తాయి. అక్కడే ఉన్న ఎన్విరాన్మెంటల్ స్టడీ సెంటర్లో జంతువుల ఎముకలు, పుర్రె భాగాలు చూడొచ్చు. దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్లు జంగిల్‌సఫారీ ఆహ్లాదకరంగా సాగుతుంది.
ప్యాకేజీలు ఇలా..
జంగిల్ సఫారీ కోసం ఒక్కో వెహికల్లో ఆరుగురు ప్రయాణించవచ్చు. సోమవారం నుంచి గురువారం వరకు ట్రిప్‌కు రూ.3,500, శుక్ర, శని, ఆదివారాల్లో ట్రిప్‌కు రూ.4వేలు చార్జ్ చేస్తారు. అదనంగా ఎక్కితే ఒక్కొక్కరికి రూ.500 ఎక్స్ట్రా చెల్లించాలి. వీకెండ్స్‌లో టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. జన్నారంలో టూరిజం డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో హరిత కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.
సోమవారం నుంచి గురువారం వరకు నాన్ఏసీ రూమ్‌కు రూ.1,155, ఏసీ రూమ్‌కు రూ.1,890, డార్మెటరీ నాన్ఏసీ రూ.2,500 చార్జ్ చేస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో నాన్ ఏసీకి రూ.1,260, ఏసీకి 2,100, డార్మెటరీ నాన్ ఏసీ రూ.3వేలు చెల్లించాలి. వీకెండ్స్‌లో సందర్శించేవారు వారం రోజుల ముందే ఆన్లైన్లో బుక్చేసుకోవాలి. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 9440337315, 7382619071, టూరిజం డిపార్ట్మెంట్ 7981662513.