
పులి ఎంత దూరం నడుస్తుంది.. మహా అయితే తను నివసిస్తున్న అడవి నుంచి పక్కనే ఉన్న అడవులకు ప్రయాణించగలదు. కానీ ఇటీవల ఒక పెద్ద పులి 450 కిలో మీటర్లు ప్రయాణించడం వైరల్ గా మారింది. వాహనాల్లో తప్ప వెళ్లలేని దూరాన్ని కాలి నడకన పులి చేరుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫారెస్టు అధికారులు.
మహారాష్ట్ర దారుశివ జిల్లా నుంచి ఆదిలాబాద్ అడవుల మీదుగా పులి ప్రయాణించినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. నడుస్తూ నడుస్తూ యేద్శి రామలింగు అభయారణ్యానికి చేరినట్లు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా తిప్పేశ్వరం పులుల అభయారణ్యం నుంచి ఆదిలాబాద్ మీదుగా యేద్శి రామలింగు అభయారణ్యం చేరినట్లు అధికారులు తెలిపారు. అది మగపులి అని.. వయసు మూడేళ్లు ఉంటుందని తెలిపారు.
పులి అభయారణ్యం రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు. తిప్పేశ్వరం నుండి వచ్చిన పులిగా ట్రాకింగ్ కెమెరాలతో నిర్థారించారు. యేద్శి రామలింగ అభయారణ్యంలో ఉన్న శివాలయం పేరుమీద పులికి రామలింగు పులిగా పేరు పెట్టారు.