ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం
  • వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులు

అదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ముత్నూర్ నుండి గిన్నెర వైపు వెళ్తున్న రోడ్డు పెద్దపులి సంచారం స్థానికుల కంటపడింది. గిన్నెరకు చెందిన కొంతమంది యువకులు అర్ధరాత్రి ఆ మార్గంలో వెళుతుండగా పెద్దపులి కనిపించింది. దీంతో వారు వీడియో తీసి షేర్ చేయగా.. చుట్టుపక్కల గ్రామాల్లో వైరల్ అయింది. జనావాసాలకు దగ్గరలో పెద్దపులి సంచారం కనిపించడం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు షేర్ చేసిన వీడియో ఆధారంగా పెద్దపులి సంచారం.. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపులి డీప్ ఫారెస్టులోకి వెళ్లిపోయేవిధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.