బెడ్ రూంలో మంచంపై పులి

బెడ్ రూంలో మంచంపై పులి

బెడ్ రూం డోర్ తెరిచి చూడగానే బెడ్ మీద పులిని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. అస్సాంకు చెందిన మోతీలాల్ అనే వ్యక్తి అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అస్సాంలో భారీ వర్షాలు, వరదలకు కజిరంగా జాతీయ పార్కులోకి భారీ స్థాయిలో నీరు చేరడంతో కొన్ని జంతువులు బయటకు వచ్చేశాయి. ఈ క్రమంలో ఇవాళ(గురువారం)  కజిరంగా జాతీయ పార్కులోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసింది. రోడ్డు పక్కనే ఉన్న మోతీలాల్‌ అనే ఓ వ్యక్తి ఇంట్లోకి ఓ పులి చొరబడి దర్జాగా పరుపుపై సేదతీరింది. ఆ గదిలోకి వెళ్లేందుకు తలుపు తీసిన మోతీలాల్‌కు ఎదురుగా మంచంపై పులి కనిపించడంతో ప్రాణం పోయినంత పనైంది. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులిని తిరిగి పార్కులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.