V6 News

రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : పోలీస్‌‌ కమిషనర్‌‌‌‌ గౌష్ ఆలం

రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు :  పోలీస్‌‌ కమిషనర్‌‌‌‌ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌‌ కమిషనర్‌‌‌‌ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ఆదివారం సాయంత్రం వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడదన్నారు. నిబంధనలు  ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

గోదావరిఖని, వెలుగు : రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం అంతర్గాం మండల పరిధిలోని మూర్మూర్, ఎల్లంపల్లి, గోలివాడ గ్రామాలనుసందర్శించారు. అనంతరం గోలివాడలో ఏసీపీ ఎం.రమేశ్‌‌తో కలిసి పోటీ చేసిన అభ్యర్థులు, గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. రామగుండం సీఐ ప్రవీణ్​కుమార్, అంతర్గాం ఎస్​ఐ వెంకట్​ ఉన్నారు.