మంత్రి కొడాలి నానికి భద్రత పెంపు

మంత్రి కొడాలి నానికి భద్రత పెంపు

శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు నాయకులకు భద్రత పెంచారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి కొడాలి నానికి భద్రత పెంచింది ప్రభుత్వం. మంత్రి కొడాలి నానీకి  ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్లతో భద్రతను కట్టుదిట్టం చేసింది. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రతను ఏర్పాటు చేసింది.  చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని పరిశీలించిన అధికారులు.. అనంతరం వారి భద్రతను సమీక్షించిన కమిటీ , వారికి తక్షణం భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాల్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం.