ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం ఉండొద్దు

ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం ఉండొద్దు

బీజేపీ నాయకత్వంపై రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయిత్ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలకు పదును పెట్టారు.  రాష్ట్ర ప్రజలు సీఎం కావాలో లేక రెండో కిమ్ జాంగ్ ఉన్ కావాలో తెల్చుకోవాలని సూచించారు. 

"ప్రజా సేవ చేసే సీఎం, ప్రధాని కావాలో లేక రెండో కిమ్ జాంగ్ ఉన్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. ఏ రాష్ట్రం కూడా నియంతృత్వ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నా. యూపీ ప్రజలు తమ ఓటును తెలివిగా వినియోగించాలి."

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాకేష్ టికాయిత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నారు. తన స్వస్థలమైన ముజఫర్ నగర్ లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గతవారం ఆయన మండిపడ్డారు. విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారని టికాయిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్, జిన్నా గురించి కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడే వారినే ప్రజలు ఎన్నుకుంటారని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు