నైట్ 9గంటలకు ఫ్లైఓవర్ పై పడుకొని టిక్ టాక్.. యువతికి ఎస్సై వార్నింగ్

నైట్ 9గంటలకు ఫ్లైఓవర్ పై పడుకొని టిక్ టాక్.. యువతికి ఎస్సై వార్నింగ్

యువత టిక్ టాక్ మాయలో పడి.. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరు యువకులు పిచ్చి, పిచ్చి వీడియోలతో జైలు పాలైతే.. యువతులు సైతం టిక్ టాక్ పిచ్చితో  పరువు పోగొట్టుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా టిక్ టాక్ బ్యాన్ అవుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టిక్ టాక్ యాప్ చైనాది కావడం, అందులో హింసను ప్రేరేపించేలా వీడియోలు ఉండడం, దీనికి తోడు ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సైతం చైనా లో పుట్టడంతో ఆ యాప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  గూగుల్ ప్లే స్టోర్ లో సైతం టిక్ టాక్ పై నెగిటీవ్ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. దీంతో టిక్ టాక్ రేటింగ్ ఒక్కసారిగా దిగజారిపోయింది. అయితే ఈ అప్లికేషన్ బ్యాన్ అవుతుందనే ప్రచారం జరగడంతో యూజర్లు ఇష్టం వచ్చినట్లు వీడియోలు  చేస్తున్నారు. బ్యాన్ అయ్యేలోపు ఫేమస్ అవ్వాలని పిచ్చిపిచ్చిగా టిక్ టాక్  చేస్తూ వివాదానికి కారణం అవుతున్నారు

తాజాగా గుజరాత్ కు చెందిన ఓ అమ్మాయి (21) టిక్ టాక్ వీడియో చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె ఇంటి సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ పై రాత్రి 9గంటల సమయంలో టిక్ టాక్ చేసింది. ఫ్లైఓవర్ పై పడుకొని లాక్ డౌన్ ను ఎత్తేయాలని ప్రధాని మోడీని కోరుతూ వీడియో చేసింది.

అయితే ఆమె యవ్వారంపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్లు టిక్ టాక్ చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్సై ఆమెకి వార్నింగ్ ఇచ్చారు.