ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో టిక్‌టాక్ పిటిషన్

ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో టిక్‌టాక్ పిటిషన్

అమెరికాలో తమ కార్యకలాపాలను నిలిపేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థతో ఒప్పందం కుదరకపోతే సెప్టెంబరు 15లోగా ఈ సంస్థ దేశంలో కార్యకలాపాలను మూసివేయాలన్న ట్రంప్‌ యంత్రాంగం పరిపాలనా ఉత్తర్వును సవాలు చేస్తూ.. కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ వాదనను వినేందుకు అమెరికా అధికారిక యంత్రాంగం సిద్ధంగా లేకపోవటంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.

తమ మాతృ సంస్థ బైట్‌డాన్స్ అమెరికాలో‌ ఆస్తులను వదులుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం పక్షపాత ధోరణితో ఉందని ఆరోపించింది. ట్రంప్‌తో పాటు కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రాస్‌, అమెరికా వాణిజ్య శాఖలపై టిక్‌టాక్ ఫిర్యాదు చేసింది. తమ యాప్‌ అమెరికాలో అత్యంత భద్రత మధ్య కొనసాగుతోందని తెలిపింది.