భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు

V6 Velugu Posted on Apr 22, 2021

ఫన్ బకెట్ బార్గవ్.. సరదా వీడియోలతో అందర్నీ నవ్వించే ఇతని నిజస్వరూపం బట్టబయలవుతోంది. మొన్న మైనర్ బాలికను గర్భవతిని చేసి అరెస్టు కావడంతో అతని చేతిలో నమ్మి మోసపోయినవారు.. నష్టపోయిన వారు ధైర్యంగా పెదవి విప్పుతున్నారు. కెమెరా ముందు ఎంత సరదాగా అందర్నీ నవ్విస్తాడో.. నిజజీవితంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా.. ప్రవర్తించేవాడని, ముఖ్యంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాడని అతని బాధితులు చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అమ్మాయిలను లోబర్చుకునేందుకు ఎంతకైనా తెగించేవాడని, ముఖ్యంగా అతి ప్రేమ కనబరుస్తూ.. నీ కోసం నేను చావడానికైనా సిద్ధమని చేయి కోసుకుని నమ్మించే ప్రయత్నం పలుమార్లు చేసినట్లు బాధితులు చెబుతున్న కథనాలు షాక్ కు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా తన చుట్టూ తిరిగే అమ్మాయిల్లో.. 14 ఏళ్ల మైనర్ బాలిక తనను అన్నయ్యా అని సంబోధిస్తున్నా.. భార్గవ్ కామ పిశాచిలా మారి.. అత్యాచారం చేసిన విషయం పోలీసు కేసు కాకపోతే ఇతని దారుణాలు బయటకొచ్చేవని కావని అతని సన్నిహితులే చెబుతున్నారు. ఆ మధ్య మమ్మల్ని అందరినీ రూమ్‌లో నుంచి వెళ్లిపోమ్మంటే తాము మొదట్లో పట్టించుకోలేదని.. అతను పదేపదే చెబుతుండడంతో ఎందుకు గొడవ అని రూమ్ ఖళీ చేసి వెళ్లిపోయామంటున్నారు వారు. గతంలో ఓ లవర్ తో  భార్గవ్‌ తిరిగేవాడని.. ఆమె కోసం చేయి కోసుకున్నాడని.. అలాగే తర్వాత వచ్చిన ఇంకో అమ్మాయి కోసం కోసుకున్నాడు... ఇలా  చాలాసార్లు చేసేవాడని.. అన్నం తినేంత ఈజీగా చేయి కోసుకుంటాడు..  ఎందుకిలా చేస్తున్నావ్‌ అని అడిగితే ఇంకా ఎక్కువ చేసి ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసేవాడని బార్గవ్ మాజీ రూమ్ మేట్స్ చెబుతున్నారు. బార్గవ్ తో కొంత కాలం రూమ్ మేట్స్ లా ఉన్న వీరు చెప్పిందంతా ఒక ఎత్తయితే.. అతనితో కలిసి వీడియోలు చేసిన సయ్యద్‌ సుమయ ఫరాహత్‌ ధైర్యంగా పెదవి విప్పి చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడో పెద్ద కామ పిశాచి అని.. ఓ పెద్ద వుమెనైజర్‌ అని బాంబు పేల్చింది.

 ‘‘సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ లా ఫీల్ అవుతాడు.. అమ్మాయిల తొ పని వర్కవుట్‌ అవకపోతే సెంటిమెంటల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు.. ఏడ్వడం, చేతులు కట్‌ చేసుకోవడం, దాన్ని వీడియోలు చేయడం.. అంతా పబ్లిసిటీ స్టంట్‌ లా చేస్తాడు.. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ లో నెంబర్ వన్.. అతడి బాధితుల్లో  ఓ వివాహిత  భర్త కూడా ఉన్నాడు.. ఎన్నో పాపాలు చేశాడు. ఆడవాళ్లను తన వీడియోల కోసం చాలా వాడుకున్నాడు..’’ అంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం సృష్టించాయి.

Tagged Minor girl, ex-girlfriend, Social media, tiktok star bhargav, fun bucket bhargav

Latest Videos

Subscribe Now

More News