
హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం (అక్టోబర్ 08) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తిలక్‌కు కెప్టెన్సీ, రాహుల్ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. గ్రూప్–డిలో ఉన్న హైదరాబాద్ ఈ నెల 15 నుంచి సొంతగడ్డపై ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో తన పోరు ప్రారంభించనుంది.
హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కచి డైమండ్ ( కీపర్), రాహుల్ రాదేశ్ (కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: పి. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్.